KMR: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్లు విక్టర్, మధుమోహన్తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 65 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరిచారు.