MDK: చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మంగళవారం సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, భద్రతా చర్యలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.