NZB: ధర్పల్లి మండలం కొటాల్ పల్లి, హోన్నజీపేట్ గ్రామాల్లో ఇటీవల అక్రమంగా డంపు చేసిన 200 ట్రాక్టర్ల ఇసుకను ఈనెల 27న తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వేలం వేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు