MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల జడ్పీహెచ్ఎస్లో ఏప్రిల్ మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డా. భరత్ నందన్ రెడ్డి నేతృత్వంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. గుండె జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తారని సర్పంచ్ గాయత్రి దేవి తెలిపారు.