మంచిర్యాల జిల్లా జన్నారం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. డ్యూటీలో బైక్‌పై పెట్రోలింగ్ చేస్తుండగా శుక్రవారం బొమ్మన గ్రామ సమీపాన బైక్‌పై నుంచి అదుపుతప్పి కిందపడ్డాడు. గాయపడిన అతడిని స్థానికులు 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.