GDWL: గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో పోలీసు, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సమస్యల తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.