వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ (పాత శిశు మందిర్)లో ఈనెల 13వ తేదీన భారీ ‘హిందూ సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం సరస్వతినగర్ పరిసరాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ‘శ్రీరామ జయరామ జై జై రామ’ అంటూ భజనలు చేస్తూ హిందూ బంధువులను ఆహ్వానించారు.