ASF: కెరమెరి మండలంలో స్కూలుకు వెళ్తున్న బాలికను వేధిస్తున్న సాయికృష్ణపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు రెబ్బెన మండలం నార్లపూర్ గ్రామానికి చెందినవాడు. ఫోన్ ద్వారా, నేరుగా వేధిస్తున్నాడన్న ఫిర్యాదుతో ఎస్సై మధుకర్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విద్యార్థుల భద్రతపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.