JGL: రైతులు ఎప్పుడూ ఒకే పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానం అనుసరిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలు పొందవచ్చని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. వరి కోత తర్వాత కొయ్య కాళ్లు కాల్చడం వల్ల భూమి సారవంతత తగ్గుతుందని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని సూచించారు.