HYD: నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య ఎక్కవవుతోంది. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి డా. బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ వైపు వాహనాల రాకపోకలు మందగించాయి. పీక్ అవర్స్ కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.