MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నాయకులను దేవరకద్ర పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే అక్రమ అరెస్టులతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడాలని అన్నారు.