నారాయణపేటకు వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి TUCI నేతలు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని కోరారు. సీఎం వేతనాల పెంపు ప్రకటించినప్పటికీ పంచాయతీ కార్మికులపై స్పష్టత లేదని జిల్లా కార్యదర్శి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.