HYD: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఫిలింనగర్లోని స్వామి వివేకానంద నగర్ బస్తీలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీ అధ్యక్షుడు హనుమంతు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్తీలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహనీయుల జయంతుల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన వెల్లడించారు.