NZB: ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు, చెత్త చెదారాన్ని తొలగించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలగించామన్నారు.