VKB: కొడంగల్ మండలం అంగడిరైచూర్ జీపీ పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో ఎట్టకేలకు అంగన్వాడీ భవనం పునర్నిర్మాణం దిశగా సాగుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు నేడు కార్యరూపం దాల్చడంతో వడివడిగా పనులు సాగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.