WGL: దుగ్గొండి(M) బిక్కాజిపల్లి గ్రామంలో వడదెబ్బతో గాదం వినయ్ కుమార్ మృతి చెందాడు. సోమవారం ఉదయం తండ్రితో కలిసి పొలంలో పని చేస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.