MDCL: చర్లపల్లి సెంట్రల్ జైలులో డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు. మత్తు పదార్థాలకు బానిసైన ఖైదీలకు విముక్తి కల్పించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు శాఖ అధికారులు తెలిపారు. డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఖైదీలలో మార్పు తీసుకురావడం, వారికి మానసిక బలం పెంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.