NLG: చిట్యాల మండలం ఆరెగూడెంలో సీతారామచంద్ర స్వామి సహిత, దుర్గా మల్లేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించబడునని గ్రామ సర్పంచ్ శ్యాంసుందర్ తెలిపారు. నేడు ఉదయం పూజలు ప్రారంభమై ఈనెల 20 వ తేది సోమవారం విగ్రహాల ప్రతిష్టలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.