NLG: జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో జిల్లా స్థాయిలో కౌమార విద్యపై ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం, విద్యార్థులకు పోస్టర్ ఫెయిర్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సమన్వయకర్త వి. సుధాకర్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బిక్షపతి పాల్గొన్నారు.