సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాలతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. పలు కాలనీల్లో పూడికతో నిండిన డ్రైనేజీలను కార్మికులు శుభ్రం చేయడంతో పాటు, ప్రధాన రహదారులపై ఉన్న మట్టి, చెత్తను తొలగించారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలి.