HNK: హన్మకొండ నగరంలో రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు GWMC ఈఈ రవి కుమార్ తెలిపారు. కేయుసి క్రాస్ రోడ్డు నుంచి మంగళి వాగు వరకు కొత్తగా వేసిన 300 ఎం.ఎం పైప్లైన్కు నల్లా కనెక్షన్ల పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లష్కర్ సింగారం, నయీమ్ నగర్, పోచమ్మ గుంట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని పేర్కోన్నారు.