VKB: దోమలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్కూల్కు వెళ్తున్న పిల్లలు, రోడ్లపై నడిచే వాహనదారులు కోతుల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా తిరిగే కోతులు ఇళ్లలోకి చొరబడి నిత్యవసర సరుకులు తీసుకెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అధికారులు వెంటనే స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.