SDPT: దుద్దెడలోని 800 ఏళ్ల నాటి స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయం మహిమలకు నిలయంగా వెలుగొందుతోంది. కాకతీయ సామంత రాజు యాదవ రెడ్డి నిర్మించిన ఈ పురాతన ఆలయంలోని తీర్థం అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర జలాన్ని పంట పొలాలపై చల్లితే చీడపీడలు తొలగి, దిగుబడి పెరుగుతుందని రైతులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.