ADB: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం, రాష్ట్రం ప్రగతి సాధిస్తాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గ్రామీణాభివృద్ధి – సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిశోర బాలికల యువతుల మాక్ పార్లమెంట్ స్నేహ అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పేర్కొన్నారు.