MBNR: నగర కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్లో పారిశుద్ధ్య చర్యలకు పెద్దపీట వేస్తామని కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పనులను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది రాకూడదని ఆదేశించారు.