BDK: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇల్లందులో బీఆర్ఎస్వీ నాయకులను ఇవాళ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నేతలు విమర్శించారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని వారు అన్నారు.