NLG: వెలిమినేడులో సీపీఎం బలపరిచిన అభ్యర్థి బొంతల చంద్రారెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంతటి నరసింహపై 307 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మండలంలోని ఇతర గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా.. అందుకు భిన్నంగా వెలిమినేడులో మాత్రం సీపీఎం బలపరిచిన అభ్యర్థి గెలుపొంది ఎర్రజెండా సత్తాను చాటారు.