ADB: విద్యార్థి దశలోని జ్ఞాపకాలు ఎంతో గొప్పవని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శనివారం బజార్హత్నూర్ మండలంలోని మన్కాపూర్ గ్రామంలో నిర్వహించిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీకి కొమరం భీమ్ స్టడీ సర్కిల్ సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.