తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా IRS అధికారి బత్తిని సురేష్ బాధ్యతలు స్వీకరించారు. సురేష్‌ను తెలుగు రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన HYD రీజియన్ ఇన్‌కం ట్యాక్స్ చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు.