KNR: సైదాపూర్ మండలం ఘణపూర్ ఎస్సీ కాలనీలో ఈ నెల 30న పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎంఆర్వో శ్రీనివాస్ తెలిపారు. అస్పృశ్యత, అంటరానితనం, దళితుల కుల వివక్ష నిర్మూలన, ప్రజల మధ్య సమానత్వం, పౌరుల ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించే దిశగా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పోరాకుల దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.