JGL: మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామ గండి హనుమాన్ దేవాలయ హుండీలను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు లెక్కించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా రేపు ఉదయం భక్తులు 11 రోజుల దీక్షలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.