WNP: చిట్యాల జడ్పీలో జీహెచ్ఎం గణేష్ కుమార్ ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. 20 మంది విద్యార్థులు టీచర్లుగా విద్యార్థులకు పాఠాలను బోధించారు. 10వ తరగతి విద్యార్థిని చందన జీహెచ్ఎం పాత్ర పోషించారు. విద్యార్థుల బోధనా తీరును తెలుగు పండిట్ గిర్రాజాచారి పర్య వేక్షించారు. టీచర్ సిద్ది రవి సాయి ప్రకా శ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.