ADB: కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో కార్మికులు తమ హక్కులను సాధించుకోవాలని CPI(ML) మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్ సింగ్ అన్నారు. ADB రూరల్ మండలంలోని నిషాన్ ఘాట్లో లెనిన్ 146 జయంతి వేడుకలను నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కార్మిక, కర్షక సమస్యలపై ఉద్యమించిన విప్లవకారుడు లెనిన్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.