MHBD: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలో పలు మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఇండ్లల్లో శుభకార్యాలు జరిగితే మోదుగాకు విస్తర్లు విరివిగా కనిపించేవి. కానీ నేడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు అందుబాటులోకి వచ్చేశాయి. మోదుగాకు విస్తర్లలో భోజనం ఆరోగ్యంతో పాటు సంతృప్తిని ఇస్తే.. ప్లాస్టిక్ ప్లేట్లల్లో భోజనం అనారోగ్యాన్ని కట్టబెడుతుంది.