MLG: గోవిందరావుపేట(M) పస్రాలోని అభ్యుదయ కాలనీలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రవి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిజ్ ఇతర విలువైన వస్తువులు కూడా మంటల్లో బూడిదైపోయాయి. వెంటనే స్థానిక ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.