GDWL: అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలో నేటి సాయంత్రం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక అడివేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. వడ్డేపల్లి మండలాల నుంచి హిందువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న మార్పులు దృష్ట్యా హిందువులు ఏకం కావాలని ధర్మాన్ని రక్షించాలని కోరారు.