ADB: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ, వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన రూరల్ మండలంలోని చించుఘాట్, వన్వాట్ గిరిజన ఆశ్రమ పాఠశాలలతో పాటు స్టార్ ఫిఫ్టీ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా వైద్యం, భోజన వసతులపై అధికారులను ఆరా తీశారు.