PDPL: ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ కార్యక్రమాన్ని గురువారం గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్వహించింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.