WNP: ఆత్మకూర్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల కోసం ఇవాళ ఒకరు దరఖాస్తు చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శశిధర్ తెలిపారు. కోఆప్షన్లో ఒక స్థానం జనరల్, మరోటి మహిళకు రిజర్వ్ చేసినట్లు చెప్పారు. పట్టణానికి చెందిన సుదర్శన్ శెట్టి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.