VKB: పరిగిలో సోమవారం రాత్రి బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో కోలాటాలు, చిన్నారుల నృత్యాలతో వీధులగుండా కొనసాగింది. వీరశైవ సమాజ సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘసంస్కర్త బసవేశ్వరకు నివాళులర్పించారు.