MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో మంగళవారం ఓ విద్యాసంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీజీ నాలుగో సెమిస్టర్ అభ్యర్థులు అర్హులని, ఉదయం 10 గంటలకు అకాడమిక్ ఆడిటోరియంలో రాత పరీక్ష, డెమో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ధ్రువపత్రాలతో హాజరుకావాలని అధికారులు సూచించారు.