JN: స్టేషన్ ఘన్పూర్ మండలం జిట్టగూడెంకు చెందిన మహేందర్ ఇంట్లో అక్రమంగా బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై డీటీ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్ బుధవారం దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.