TG: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, KMM, MBNR, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.