NRPT: మక్తల్ బస్టాండ్లో మౌలిక సౌకర్యాల లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడం, తాగునీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వెంటనే తగిన వసతులు కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.