SDPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శివాయిపల్లిలో ‘అరైవ్ అండ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా గ్రామంలో 100% హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించి ఆదర్శంగా నిలిచారు. ప్రాణ రక్షణకు రహదారి నియమాలు పాటించాలని అధికారులు సూచించారు.