ADB: నిబంధనల అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఇచ్చోడ CI బండారి రాజు శుక్రవారం తెలియజేశారు. మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఉపసర్పంచ్ కార్తీక్ ముండై గెలిచిన సందర్భంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సంబంధిత అధికారుల అనుమతులు తీసుకొని ర్యాలీలను నిర్వహించవచ్చని తెలిపారు.