SRCL: రాచర్ల గొల్లపల్లిలో సోమవారం ఉదయం మూగజీవాలకు గాలి కుంటు నివారణ టీకాలు వేశారు. సర్పంచ్ కొండ రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారిని రేణుక పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా టీకాలు వేశారు. మూగజీవాల పెంపకందారులు ఆధార్ కార్డుతో ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నంబర్‌తో పశు ఆసుపత్రికి వచ్చి టీకాలు వేయించాలని సూచించారు.