BHNG: భువనగిరి 12వ వార్డు పగిడిపల్లిలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కడమంచి రాములు ఇంటి వద్ద ఆగిపోయిన రోడ్డు పనుల గురించి ఆదివారం కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించారు. గ్రామ పెద్దలు, యువత సహకారంతో అడ్డంకులను తొలగించి సర్వీస్ రోడ్డును క్లియర్ చేశారు.