VKB: తాండూరులోని మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ఒకే రోజు రూ. 2 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. శుక్రవారం ఈ-నామ్ పాత సాఫ్ట్వేర్ ద్వారానే పంటల కొనుగోలుకు వ్యాపారులకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా పేరుకుపోయిన ఉత్పత్తులకు ఒకేరోజు విక్రయాలు చేపట్టారు.