WGL: సంగెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ బ్రాంచ్‌ను జిల్లా కలెక్టర్ సత్యశారదదేవి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించేందుకు ఈ బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో డీసీసీ బ్యాంకులు ముఖ్యమైన వనరుగా నిలుస్తాయని ఎమ్మెల్యే అన్నారు.